ఐపీఎల్ వేలంలో పాల్గొనే తెలుగు కుర్రాళ్లు వీరే!
X
ఐపీఎల్ 2024 ఆక్షన్ కు వేళయింది. దుబాయ్ వేదికగా రేపు (డిసెంబర్ 19) జరగబోయే వేలంలో భారత్ తో సహా మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. అందులో 13 మంది తెలుగు కుర్రాళ్లు తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి 9మంది, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి నలుగురు ఆక్షన్ లో పాల్గొననున్నారు. వేలంలో పాల్గొనబోయే 13 మందిలో పలువురు ఇప్పటికే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.
హనుమ విహారీ, కేఎస్ భరత్ లు ఇప్పటికే టీమిండియా టెస్ట్ జట్టులో ఆడారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడిన హనుమ విహారీ చాలాసార్లు జట్టుకు విజయాలను అందించారు. ఐపీఎల్ లో చాలా జట్లకు ప్రాతినిథ్యం వహించిన కేఎస్ భరత్.. 2019 ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడి సత్తాచాటాడు. తర్వాత సీజన్ లో ఆర్సీబీ తనను వదులుకుని తిరిగి జట్టులోకి తీసుకోవాలని చూసినా.. కుదరలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ భరత్ ను దక్కించుకుంది. అయితే.. ప్లేయింగ్ లెవన్ లో మాత్రం అవకాశం కల్పించలేదు. ప్రస్తుతం ఢిల్లీ వదులుకుంది. దీంతో ఆర్సీబీ మళ్లీ భరత్ ను టార్గెట్ చేస్తుందా లేదా చూడాలి.
వేలంలో పాల్గొనే తెలుగు ప్లేయర్లు వీరే..
హనుమ విహారి, కేఎస్ భరత్, రికీ భుయ్, పృథ్వీరాజ్ ఎర్రా, రవితేజ, మనీశ్ రెడ్డి, మురుగన్ అభిషేక్, ఆరవెల్లి అవనీశ్ రావు, తనయ్ త్యాగరాజన్, రక్షణ్ రెడ్డి, రాహుల్ బుద్ధి, అనికేత్ రెడ్డి, రోహిత్ రాయుడు