బంగ్లాదేశ్ క్రికెటర్ పై ఐసీసీ వేటు
X
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ నాసిర్ హొస్సేన్‌పై ఐసీసీ వేటు వేసింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో ఆయనపై రెండేళ్లపాటు నిషేధం విధించింది.సెప్టెంబర్ 2023లో నాసిర్ హుస్సేన్‌పై ఐసీసీ అభియోగాలు మోపింది. నాసిర్ హుస్సేన్ మూడు ఆరోపణలను అంగీకరించాడు. ఈ క్రమంలో నాసిర్ హుస్సేన్‌పై రెండేళ్ల నిషేధం విధించగా..అందులో 6 నెలల నిషేధం కూడా ఉంది. ఈ నిషేధం 2025 ఏప్రిల్ 7 వరకు ఉంటుంది. నాసిర్ హుస్సేన్ 2011లో బంగ్లాదేశ్ తరఫును అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఏడేళ్ల పాటు బంగ్లాదేశ్ క్రికెట్ లో నిలకడగా ఆడుతూ కీలక ప్లేయర్ గా మారాడు. కెరీర్ లో మొత్తం 115 మ్యాచ్ లు ఆడి 2695 పరుగులు చేశాడు. బౌలింగ్ లోనూ రాణించి 39 వికెట్లు పడగొట్టాడు. 2018 తర్వాత ఎక్కువగా దేశవాళీ క్రికెట్ ఆడాడు.
అసలు ఏం జరిగిందంటే?
నిజానికి బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ నాసిర్ హుస్సేన్ కు గుర్తు తెలియని వ్యక్తి బహుమతి ఇచ్చాడు. ఇందుకోసం ఆయనకు ప్రత్యేక డిమాండ్ కూడా చేశారు. అతను ఈ సమాచారాన్ని బోర్డుకు లేదా అవినీతి నిరోధక అధికారికి ఇవ్వలేదు. ఆ తర్వాత విచారణ జరిగినా అధికారులకు సహకరించలేదు. అందుకే ఇప్పుడు రెండేళ్ల పాటు నిషేధానికి గురయ్యాడు.
నాసిర్ హుస్సేన్పై 3 ఆరోపణలు
• ఆర్టికల్ 2.4.3 ఉల్లంఘన - ఐఫోన్ 12 రూపంలో నాసిర్ కు US$ 750 కంటే ఎక్కువ విలువైన బహుమతి ఇవ్వబడింది. ఈ విషయాన్ని ఆయన అవినీతి నిరోధక శాఖ అధికారికి తెలియజేయలేదు.
• ఆర్టికల్ 2.4.4 ఉల్లంఘన నాసిర్ ఏదైనా తెలియని వ్యక్తి సంప్రదించినట్లు అవినీతి నిరోధక అధికారికి తెలియజేయలేదు. ఇది కాకుండా అవినీతికి సంబంధించిన కార్యకలాపాల కోసం ఏదైనా ఆహ్వానాన్ని అంగీకరించడం, దాని గురించి అధికారికి తెలియజేయకపోవడంలో కూడా అతను దోషిగా తేలాడు.
• ఆర్టికల్ 2.4.6 ఉల్లంఘన- ఈ కేసును అవినీతి నిరోధక అధికారి దర్యాప్తు చేస్తున్నప్పుడు నాసిర్ అతనికి సహకరించలేదు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వారికి ఇవ్వడంలో కూడా అతను విఫలమయ్యాడు.