HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సంచలన ప్రకటన
X
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సంచలన ప్రకటన చేశారు. రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుపై వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ జట్టుకు రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కెప్టెన్ తిలక్‌వర్మ, ఓపెనర్ తన్మయ్ అగర్వాల్, స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్, ఫైనల్లో సెంచరీలు సాధించిన నితిశ్ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డికి తలో రూ.50 వేలు ప్రత్యేక నగదు బహుమతిని జగన్‌మోహన్ రావు ప్రకటించారు.
ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్‌మోహన్ రావు.. హైదరాబాద్ క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. పాలన వ్యవహారాల్లో తన మార్క్ పనితీరును కనబరుస్తున్నారు. దగ్గరుండి స్టేడియాన్ని పూర్తిగా రినోవేషన్ చేయించిన ఆయన.. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్కూల్ పిల్లలు, భారత సైనికులకు భారత్-ఇంగ్లండ్ తొలి టెస్ట్‌కు ఫ్రీగా ప్రవేశం కల్పించారు.
Hyderabad Cricket Association (HCA),President Jagan Mohan Rao,sensational announcement,Hyderabad team,captain Tilakvarma,opener Tanmay Agarwal,spinner Tanay Thyagarajan,Nitish Reddy,Pragnaya Reddy