నీ వల్లే నేను ఉన్నా..సచిన్ ఎమోషనల్ పోస్ట్
X
ఇవాళ తన తండ్రి రమేశ్ టెండూల్కర్ పుట్టిన రోజు సందర్భంగా బ్యాటింగ్ మేస్ట్రో సచిన్ ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి వల్లే తాను ఈ స్థాయికి చేరానని అన్నాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. "మా నాన్న మా పట్ల ఎల్లప్పుడూ చాలా కేరింగ్ గా ఉండేవాడు. ఏమాత్రం స్ట్రిక్ట్ గా ఉండేవాడు కాదు. నా లక్ష్యాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని మా నాన్న నాకు కల్పించాడు. అలాగే నా కళలను సాకారం చేసుకోవడంలో పూర్తిగా సహకరించాడు. ఆయన మమ్మల్ని పెంచిన విధానం, మాకు పంచిన ప్రేమ, ఇచ్చిన స్వేచ్ఛ.. ఇవన్నీ మంచి పేరెంటింగ్ కు చక్కని ఉదాహరణగా నిలుస్తాయనేది నా నమ్మకం. మా నాన్న ఆలోచనలు ఎప్పుడూ అడ్వాన్స్ గా ఉండేవి. మా నాన్నంటే నాకు ఇష్టమైన లక్షల కారణాల్లో ఈ విషయం నాకు ఆయనపై ఉన్న ప్రేమను ఇంకా ఎక్కువ చేసింది. నువ్వు లేకుంటే నేను లేను నాన్న. హ్యాపీ బర్త్ డే బాబా (నాన్న).. మిస్ యూ ఎవ్రీ డే" అంటూ సచిన్ ఎమోషనల్ అయ్యాడు. ఇక తన నాన్నతో ఉన్న ఓ ఫోటోను సచిన్ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. కాగా సచిన్ తండ్రి రమేశ్ టెండూల్కర్ 1999 మే 19న అనారోగ్యంతో మృతి చెందాడు.