116 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
X
భారత బౌలర్ల దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ఇండియన్ బౌలర్స్ అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్ విజృంభించడంతో సౌతాఫ్రికా 116 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డేలో అర్ష్దీప్ సింగ్ 37 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా.. అవేశ్ ఖాన్ 27 రన్స్ ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక చివరి వికెట్ ను కుల్దీప్ యాదవ్ దక్కించుకున్నాడు. కాగా మొదట టాస్ నెగ్గిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. 27.3 ఓవర్లు ఆడి 116 పరుగులు మాత్రమే చేయగలిగింది ఆ జట్టు. ఇక సౌతాఫ్రికా బ్యాటర్లలో ఫెలుక్వాయో 33 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. టోనీ డి జోర్జి 28 రన్స్, మార్క్రమ్ 12, షంసీ 11 పరుగులు మాత్రమే చేశారు. ఇక మిగిలిన బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యారు. కాగా భారత్ గెలవాలంటే 50 ఓవర్లలో 117 పరుగులు చేయాల్సి ఉంది. మూడు వన్డేల ఈ సిరీస్ కు భారత జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహిస్తున్నాడు.