Home > క్రీడలు > Ganguly : టీమిండియా మాజీ కెప్టెన్ ఫోన్ చోరీ

Ganguly : టీమిండియా మాజీ కెప్టెన్ ఫోన్ చోరీ

Ganguly : టీమిండియా మాజీ కెప్టెన్ ఫోన్ చోరీ
X

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఖరీదైన మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. దీంతో గంగూలీ ఠాకూర్‌పుకూర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన మొబైల్‌లో ముఖ్యమైన వ్యక్తిగత డేటాను ఉందని, వెంటనే ట్రేస్‌ చేయాలని పోలీసులను కోరారు. వివరాల్లోకి వెళ్తే.. బెహలా చౌరస్తాలోని గంగూలీ ఇంటికి రంగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పెయింటింగ్ వేయడానికి వచ్చిన కొంతమంది వర్కర్లలో ఎవరో ఒకరూ ఈ ఫోన్ దొంగిలించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఇక చోరీకి గురైన గంగూలీ ఫోన్ ధర రూ.1.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే ఫోన్ గురించి గంగూలీకి ఎలాంటి సమస్యలేదని, కానీ అందులోని విలువైన డేటా గురించే ఆయన ఆందోళన చెందుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.

ఇక తన ఫోన్ గురించి గంగూలీ మాట్లాడారు. ‘‘నా ఫోన్ ఇంటి నుంచే చోరీకి గురైందని నేను భావిస్తున్నాను. నేను చివరగా జనవరి 19న ఉదయం 11:30 గంటల సమయంలో నా ఫోన్‌ని చూశాను. ఆ తర్వాత కనిపించలేదు. దీంతో నేను ఫోన్ కోసం వెతికాను. కానీ అది దొరకలేదు. నా ఫోన్ పోయినందుకు తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ఎందుకంటే ఫోన్‌లో చాలా మంది కాంటాక్టు నంబర్లు, నా వ్యక్తిగత సమాచారం ఉంది. ఫోన్‌ను ట్రేస్ చేయమని, తగిన చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.’’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గంగూలీ పేర్కొన్నాడు.



Ex-captain,Team India,ex-BCCI president,Sourav Ganguly,expensive mobile phone,Thakurpukur police station,workers,personal information

Updated : 11 Feb 2024 6:02 PM IST
Tags:    
Next Story
Share it
Top