Home > తెలంగాణ > 'టెన్త్' సైన్స్ పరీక్షకు రెండు రోజులు!

'టెన్త్' సైన్స్ పరీక్షకు రెండు రోజులు!

టెన్త్ సైన్స్ పరీక్షకు రెండు రోజులు!
X

2024 మార్చిలో జరగనున్న టెన్త్ పరీక్షల్లో ఈ సారి సైన్స్ సబ్జెక్ట్ కు రెండు రోజులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పదో తరగతిలో మొత్తం 6 సబ్జెక్టులు ఉంటాయి. వార్షిక పరీక్షలో ఈ ఆరు సబ్జెక్టుల్లో 5 సబ్జెక్టులకు 80 మార్కుల చొప్పను ఒక్కో పేపర్ ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు 3 గంటల సమయం ఉంటుంది. కానీ సైన్స్ కు మాత్రం ఇది వేరుగా ఉంటుంది. ఒకేరోజు సైన్స్ కు సంబంధించిన భౌతిక శాస్త్రం (40 మార్కులు), జీవశాస్త్రం (40 మార్కులు) ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో నిర్వహిస్తున్నారు. కేవలం 15 నిమిషాల వ్యవధితో మధ్యాహ్న పరీక్షను నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పడుతోందని టీచర్లు, తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే సైన్స్ పరీక్షలను రెండు రోజులు నిర్వహించాలని వారంతా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే సైన్స్ పరీక్షలను రెండు రోజులు నిర్వహించేలా విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దాదాపు ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉందని విద్యాశాఖకు చెందిన సీనియర్ అధికారొకరు తెలిపారు. అదే గనుక జరిగితే ఈ ఏడాది నుంచి సైన్స్ పరీక్షకు రెండు రోజులు కేటాయిస్తారు. కాగా గతంలో టెన్త్ వార్షిక పరీక్షలు 11 రోజుల పాటు నిర్వహించేవారు. హిందీకి తప్ప ఒక్కో సబ్జెక్ట్ కు రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహించేవారు. కానీ కరోనా తర్వాత 6 సబ్జెక్టులను 6 రోజుల్లో నిర్వహిస్తూ వస్తున్నారు.

Updated : 22 Dec 2023 4:24 PM IST
Tags:    
Next Story
Share it
Top