తెలంగాణలో భారీగా ఎమ్మార్వోల బదిలీ
X
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో అధికారుల బదిలీలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు అధికారులను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 132 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్-1, మల్టీజోన్-2లో ఎమ్మార్వోల బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మల్టీజోన్-1లో 84 మంది, మల్టీజోన్-2లో 48 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. పలువురు అధికారులకు ప్రమోషన్లు ఇచ్చి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరికొందరు డిప్యూటీ కలెక్టర్లు వెయిటింగ్ లో ఉండగా పోస్టింగ్ ఇచ్చారు. కాగా ఒకే చోట మూడేళ్లు పనిచేసేవారు.. సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తోన్న వారిని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారుల బదిలీ చేపట్టింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.