Home > తెలంగాణ > తెలంగాణలో కొత్తగా 8 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 8 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 8 కరోనా కేసులు
X

కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కేసులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 8 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇక ప్రస్తుతం 59 మంది కోవిడ్ చికిత్స పొందుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ రోజు 1,333 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, మరో 30 మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ కేసుల సంఖ్య 8,44,566కి పెరిగింది. తాజాగా నలుగురు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 8,40,396 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.


Updated : 26 Dec 2023 9:55 PM IST
Tags:    
Next Story
Share it
Top