Home > తెలంగాణ > కుమారీ ఆంటీకి అండగా సామాన్య మహిళ.. ఏ విషయంలో అంటే?

కుమారీ ఆంటీకి అండగా సామాన్య మహిళ.. ఏ విషయంలో అంటే?

కుమారీ ఆంటీకి అండగా సామాన్య మహిళ.. ఏ విషయంలో అంటే?
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ అంటే హైదరాబాద్ లో తెలియని వారుండరు అంటే ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. ఆమె తయారు చేసే ఫుడ్ కు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు ఫుడ్ లవర్స్. దీంతో స్టాల్ వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో రోడ్లపై రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఫుడ్ స్టాల్ ఎత్తివేయాలని తెలంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఆమె స్టాల్ ను అక్కడి నుంచి తీయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే తాను కుమారి ఆంటీ స్టాల్ కు వెళ్తానని కూడా హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కుమారి ఆంటీ మరింత పాపులర్ అయింది. దీంతో మీడియా ఛానళ్ల ప్రతినిధులు నిత్యం ఆమె ఇంటికి, ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లి కుమారి ఆంటీ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు.

కాగా కుమారి ఆంటీని ప్రమోట్ చేస్తున్న మీడియాపై ఓ సామాన్య మహిళ మీడియాపై విరుచుకుపడ్డారు. 'మీడియా వాళ్లు ఇక్కడికి ఎవ్వరూ రాకండి, ఆమెను హైలెట్ చేయకండి. రోడ్డు మీద వ్యాపారాలు చేసుకుంటున్న తమను కుదురుగా బతకనివ్వండి' అని అన్నారు. అందుకు మీడియా ప్రతినిధులు " మీ.. వృత్తి అది, మా వృత్తి ఇది" అని సమాధానమిచ్చారు. అందుకు కౌంటర్ గా సదరు మహిళ 'దేశంలో చాలా సమస్యలున్నాయ్, అన్యాయాలు, ఆడపిల్లలపై అకృత్యాలు, డ్రగ్స్, గంజాయి రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అక్కడి వెళ్లి ప్రశ్నించండి' అంటూ నిలదీశారు. ఇక్కడికొచ్చి చికెన్, చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి బాగుందా.. ఇవేనా మీరు చేసే రిపోర్టింగ్ అంటూ మీడియాపై మండిపడ్డారు. దీంతో అక్కడున్న యూట్యూబ్ చానల్ రిపోర్టర్లు ఏం మాట్లాడాలో తెలియక తెలియక తడబడ్డారు. ప్రస్తుతం ఆ మహిళ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Updated : 4 Feb 2024 4:27 PM GMT
Tags:    
Next Story
Share it
Top