Home > తెలంగాణ > Praja Palana : 'ప్రజా పాలన'కు ప్రత్యేక వెబ్ సైట్.. ప్రారంభించనున్న సీఎం

Praja Palana : 'ప్రజా పాలన'కు ప్రత్యేక వెబ్ సైట్.. ప్రారంభించనున్న సీఎం

Praja Palana : ప్రజా పాలనకు ప్రత్యేక వెబ్ సైట్.. ప్రారంభించనున్న సీఎం
X

రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రజా పాలన పేరుతో అర్హుల నుంచి దరఖాస్తులు సేకరించింది. కాగా ఈ దరఖాస్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులను నమోదు చేయడం కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను తీసుకురానుంది. ఈ ప్రజా పాలన వెబ్ సైట్ ను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రజా పాలనకు సంబంధించి అభయహస్తంలోని ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు రూ.2500, రూ.500కే గ్యాస్ తదితర ఆరు గ్యారెంటీల హామీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి 25 లక్షల 83 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుల డేటాను ఎంట్రీ చేయడం కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించనుంది. అందులో ప్రతి స్కీమ్ కు సంబంధించిన అర్హత వివరాలు, విధివిధానాలు, అర్హుల జాబితా తదితర వివరాలను పొందుపరచనున్నారు. ప్రతిదీ పారదర్శకంగా ఉండేందుకు ఈ వెబ్ సైట్ ను తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇక కొత్త రేషన్ కార్డుల విధివిధానాలను కూడా ఈ సైట్ లో పొందుపరచనున్నారు. ఇక ఈ వెబ్ సైట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.




Updated : 8 Jan 2024 9:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top