రామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం..
Vijay Kumar | 19 Jan 2024 4:23 PM IST
X
X
హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కంపెనీ సీఈఓ మృతిచెందాడు. విస్టెక్స్ కంపెనీకి సంబంధించిన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి కంపెనీ చైర్మన్ విశ్వనాధరాజ్, సీఈవో సంజయ్ షాతో పాటు పదుల సంఖ్యలో ఉద్యోగులు కూడా హాజరయ్యారు. అయితే లైమ్ లైట్ గార్డెన్లో ఫంక్షన్ ప్రారంభానికి ముందు కంపెనీ సీఈవో, చైర్మన్ క్రేన్ మీదుగా కిందికి దిగుతుండగా క్రేన్ వైర్లు తెగిపోయాయి. దాంతో కంపెనీ సీఈవోతో పాటు పలువురు కంపెనీ ప్రతినిధులు కిందపడిపోయారు. ఈ ఘటనలో కంపెనీ సీఈవో సంజయ్ షా మృతిచెందగా.. చైర్మన్ విశ్వనాధరాజ్కు తీవ్రగాయాలయ్యాయి. ఫిల్మ్‌సిటీ నిర్వాహకులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated : 19 Jan 2024 4:47 PM IST
Tags: accident Ramoji Film City Hyderabad Vistex Company ceo Sanjay Shah chairman Viswanadharaj crane employees abudullapur police
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire