పిచ్చంటారండీ దీన్ని.. రీల్స్ కోసం రోడ్డెక్కిన యువతి
X
రీల్స్ పిచ్చితో ఓ యువతి నడి రోడ్డు మీద హంగామా చేసింది. రెడ్ సిగ్నల్ పడగానే రోడ్డు మీదకి వచ్చి డ్యాన్స్ చేసింది. దీంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. కాగా ఈ వీడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు. "నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది" అని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ.. ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనదంమో.. ఏమో! అంటూ ఆయన ఫైర్ అయ్యారు. కాగా యువతి డ్యాన్స్ వీడియోపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. 'వావ్ డ్యాన్స్ బాగా చేశావు' అంటూ కొందరు పాజిటివ్ కామెంట్ చేస్తుంటే.. 'ఇలాంటివి చేస్తే మీ ఇంట్లో పేరెంట్స్ ఏమనరా?'అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.