Home > తెలంగాణ > ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం యువకుడి వినూత్న నిరసన

ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం యువకుడి వినూత్న నిరసన

ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం యువకుడి వినూత్న నిరసన
X

టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు కేటాయించాలని ఓ యువకుడు వినూత్న నిరసనకు దిగాడు. బస్సులు మొత్తం మహిళలతోనే నిండిపోతున్నాయని, పురుషులకు కూర్చునేందుకు సీట్లు ఉండటం లేవంటూ బస్సు ముందు నిలబడి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో జరిగింది. వాసు అనే ప్రయాణికుడు వరంగల్ కు వెళ్తున్న బస్సు ముందుకు వచ్చి ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలంటూ నిరసనకు దిగాడు. మహిళలకు ఫ్రీ జర్నీ పథకం బాగానే ఉందని.. ఈ స్కీమ్ వల్లే తన భార్య, కూతురు బస్సులో ఉచితంగా వచ్చారని అన్నాడు. అయితే పురుషుల పరిస్థితి కూడా ఆలోచించాలని అన్నాడు.

బస్సులు మొత్తం మహిళలతోనే నిండిపోవతున్నాయని, దీనివల్ల పురుషులు ఇబ్బంది పడుతున్నారని అన్నాడు. బస్సు ఎక్కుదామంటే మొత్తం మహిళలే ఎడబడుతున్నారని, సీట్లు లేక చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే బస్సులో 20 సీట్లు ఉంటే 10 సీట్లు మహిళలకు.. మిగిలిన 10 సీట్లు పురుషులకు కేటాయించాలని కోరాడు. కాగా ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో ఏ బస్సులో చూసినా మహిళలే కనబడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

Updated : 16 Dec 2023 2:11 PM GMT
Tags:    
Next Story
Share it
Top