Home > తెలంగాణ > హైకోర్టును వేరే చోట నిర్మించాలి.. ఈటల రాజేందర్

హైకోర్టును వేరే చోట నిర్మించాలి.. ఈటల రాజేందర్

హైకోర్టును వేరే చోట నిర్మించాలి.. ఈటల రాజేందర్
X

తెలంగాణ హైకోర్టును వేరే చోట నిర్మించాలని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ అన్నారు. రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పోలీసుల దాడిలో గాయపడిన ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీని శుక్రవారం ఈటల రాజేందర్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయాలకు పెద్ద ఎత్తున భూములు అవసరం ఉంటుందని, ప్రాక్టికల్ గా నేర్చుకునే కోర్సులు ఉంటాయని అన్నారు. అలాంటి రాజేంద్రనగర్ విశ్వవిద్యాలయ భూమిని కోర్టు కోసం కేటాయించారని అన్నారు. కోర్టు కట్టవద్దని ఏబీవీపీ ఉద్యమాలు చేయడం లేదన్న ఈటల.. హైకోర్టును వేరే చోట మాత్రమే కట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూములు అమ్ముకుంటున్నారని, అమ్ముకోవడానికి భూములు వస్తున్నాయి కానీ కోర్టుకు లేవా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని అన్నారు.

తమ భూములు ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నారని మాత్రమే విద్యార్థులు అడుగుతున్నారని అన్నారు. అక్కడ విద్యార్థులు ఉద్యమం చేస్తున్న క్రమంలోనే వారిపై పోలీసులు వ్యవహరించిన తీరు బాగాలేదని అన్నారు. ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీని పోలీసులు జుట్టుపట్టుకొని లాగి కింద పడేసిన విధానం జుగుప్సాకరమని అన్నారు. ఆమేమీ మానవబాంబు కాదని, ధ్వంసం చేసే ఆమె కాదని అన్నారు. విద్యార్తి నాయకురాలిపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికాకతప్పదని ఈటల రాజేందర్ హెచ్చరించారు.


Updated : 26 Jan 2024 9:52 PM IST
Tags:    
Next Story
Share it
Top