Home > తెలంగాణ > సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
X

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27 (బుధవారం) కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎలక్షన్లకు సంబంధించి క్యాంపెయినింగ్ ఇప్పటికే ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను ప్రకటిస్తారు.

2021తో ముగిసిన కాలపరిమితి

దక్షిణ భారతంలో ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన సింగరేణి పరిధిలో 24 భూగర్భ, 18 ఓపెన్‌ కాస్ట్‌ గనులు ఉన్నాయి. వాటిలో 39 వేల మంది కార్మికులు పని చేస్తు న్నారు. 1998 నుంచి సింగరేణిలో కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి తొలుత రెండేళ్లు ఉండగా ఆ తర్వాత నాలుగేళ్లకు పెంచారు. 2017 అక్టోబర్‌లో చివరిసారి సింగరేణి ఎన్నికలు జరగగా 2021 అక్టోబర్‌తో కాలపరిమితి ముగిసింది. ఆ తర్వాత గత ప్రభుత్వం వివిధ కారణాలతో ఎన్నికలకు మొగ్గు చూపలేదు. దీంతో ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ కోర్టును ఆశ్రయించింది. కోర్టు జోక్యం చేసుకోవడంతో ఎన్నికల ప్రక్రియ మొదలైంది.

హైకోర్టు జోక్యంతో

నిజానికి అక్టోబర్ 6న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. అదే నెల 10వ తేదీకల్లా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి కార్మిక సంఘాలకు గుర్తులు కూడా కేటాయించారు. అక్టోబర్‌ 30న పోలింగ్‌ నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మరోసారి జోక్యం చేసుకున్న హైకోర్టు ఈనెల 27న పోలింగ్‌ నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం 39,773 మంది కార్మికులు ఓటుహక్కు వినియోగించుకోనుండగా.. 13 కార్మిక సంఘాలు బరిలో ఉన్నాయి. ఎన్నికల విధుల కోసం 650 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించగా.. 460 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

84 పోలింగ్ కేంద్రాలు

పోలింగ్ కోసం సింగరేణి పరిధిలోని 11 ప్రాంతాల్లో 84 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీరాంపూర్‌ ఏరియాలో అత్యధికంగా 15 కేంద్రాలు ఉండగా.. ఇల్లెందులో అతి తక్కువగా 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలుత ఏరియాలవారీగా ఓట్లు లెక్కిగపవ విజేతలను ప్రకటిస్తారు. ఆ తర్వాత పోలైన ఓట్లలో సగానికబదబా ఎక్కువ ఓట్లు సాధించిన సంఘానికి హోదా ఇస్తారు.




Updated : 26 Dec 2023 11:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top