Home > తెలంగాణ > అజారుద్దీన్, షబ్బీర్ అలీ ముస్లింలు కాదా?.. సీఎం రేవంత్

అజారుద్దీన్, షబ్బీర్ అలీ ముస్లింలు కాదా?.. సీఎం రేవంత్

అజారుద్దీన్, షబ్బీర్ అలీ ముస్లింలు కాదా?.. సీఎం రేవంత్
X

అజారుద్దీన్, షబ్బీర్ అలీలు ముస్లింలు కాదా అని సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రశ్నించారు. విద్యుత్ శ్వేతపత్రంపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. మైనారిటీల సంక్షేమం కోసం పోట్లాడే ఏకైక పార్టీ ఎంఐఎం అని, అసెంబ్లీలో తమ వాయిస్ ను నొక్కేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. మైనారిటీల అభివృద్ధి కోసం పని చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని సీఎం అన్నారు. మైనారిటీల సంక్షేమం గురించి తమకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. మైనారిటీలను సీఎం, రాష్ట్రపతిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థులను ఓడించడానికి ఎంఐఎం, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. అజారుద్దీన్, షబ్బీర్ అలీలను ఓడించేందుకు ఎంఐఎం ప్రయత్నించిందని అన్నారు. అక్బరుద్దీన్ ఎప్పుడూ తన పాత దోస్తు (కేసీఆర్)ను గెలిపించడానికే ప్రయత్నిస్తున్నారని అన్నారు. ముస్లింలు ఎంఐఎం సొంతం కాదని, వాళ్లు అందరికీ చెందినవాళ్లని సీఎం అన్నారు. ఒక్క ముస్లింలు ఓటు వేస్తేనే గెలవలేదనే విషయాన్ని అక్బరుద్దీన్ గుర్తించాలని అన్నారు.

Updated : 21 Dec 2023 11:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top