Home > తెలంగాణ > Balka Suman : సీఎం రేవంత్పై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు

Balka Suman : సీఎం రేవంత్పై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు

Balka Suman : సీఎం రేవంత్పై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు
X

సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు తాజాగా మంచిర్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్కన్ సుమన్ కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ ను రేవంత్ రెడ్డి 'రండ' అంటూ సంబోధించారని, కానీ రేవంత్ రెడ్డియే రండ, ఫాల్త్ గాడు అంటూ బాల్క సుమన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకొని కొట్టాలని అనిపిస్తోందని, కానీ తనకు సంస్కారం అడ్డు వస్తోందని అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం లేకపోవచ్చు గానీ కేసీఆర్ ను ఒక్కమాట అన్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాగా బాల్క సుమన్ వ్యాఖ్యలను టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు చారగొండ వెంకటేశ్, కైలాష్ నేత ఖండించారు. బాల్క సుమన్ కేసీఆర్ గఢీలో బానిసలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో నిరుద్యోగులు, రైతులు ఇబ్బందులు పడితే ఒక్కసారైనా మాట్లాడావా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుంటే తట్టుకోలేకే బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ చెప్పులు మోసి ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచిన బాల్క సుమన్ నేడు సీఎం రేవంత్ రెడ్డిపై చెప్పు లేపుతావా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉండి వెయ్యి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ వ్యక్తి బాల్క సుమన్ అని అన్నారు.




Updated : 5 Feb 2024 12:38 PM GMT
Tags:    
Next Story
Share it
Top