Home > తెలంగాణ > పథకాలు మావి పేరు మీకా?..బీజేపీ ఎంపీ బండి సంజయ్

పథకాలు మావి పేరు మీకా?..బీజేపీ ఎంపీ బండి సంజయ్

పథకాలు మావి పేరు మీకా?..బీజేపీ ఎంపీ బండి సంజయ్
X

ప్రజల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే ఆ క్రెడిట్ ను మాత్రం రాష్ట్రం ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందని ఎద్దేవా చేశారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం చింతకుంటలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం అమలు చేస్తున్న పథకాల విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు "వికసిత్ భారత్ సంకల్పయాత్ర" పేరుతో ఊరూరా ప్రచారం చేస్తున్నామని అన్నారు. రేషన్ బియ్యం, గ్యాస్ కనెక్షన్లు, ఉపాధి హామీతో పాటు గ్రామాల్లో జరిగే వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని అన్నారు. కానీ సొమ్మొకరిది.. సోకు ఒకరిది అన్నట్లుగా కేంద్రం పనులు చేస్తుంటే ఆ క్రెడిట్ ను రాష్ట్ర ప్రభుత్వం కొట్టేస్తుందని ఆరోపించారు. ఈ విధానం మారడానికే తాము వికసిత్ సంకల్ప యాత్ర చేపట్టామని, అందుకు అధికారులు సహకరించాలని కోరారు. కేంద్రం అమలు చేసే కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నట్లుగా మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రచారం చేసుకొని లబ్ది పొందిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పును చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని బండి సంజయ్ పార్టీ నేతలు, కార్యకర్తలను కోరారు.

Updated : 27 Dec 2023 7:44 PM IST
Tags:    
Next Story
Share it
Top