బీజేపీ-బీఆర్ఎస్ పొత్తు ఉందని ఎవరైనా అంటే చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్
X
బీజేపీ-బీఆర్ఎస్ పొత్తు ఉందని ఎవరైనా అంటే చెప్పుతో కొట్టండని బీజీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ సంకల్ప యాత్రంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉండనుందని కొందరు పనికట్టుకొని ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటి వాళ్లను వదిలిపెట్టవద్దని అన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదని, అదంటా వట్టి ప్రచారమని కొట్టిపారేశారు. మీడియాకు తప్పడు లీకులు ఇచ్చి, మీడియాను తప్పుదారి పట్టించే నాయకులు బుద్ధి చెప్పాలని బీజేపీ శ్రేణులను కోరారు. కాగా ఇదే విషయమై బీఆర్ఎస్ నాయకులు కూడా తీవ్రంగా స్పందించారు. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదని, ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని, ఆ రెండు పార్టీలపైనే తమ పోరాటం ఉంటుందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. కాగా బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రంలో మోడీ మూడోసారి పీఎం అయ్యేందుకు బీఆర్ఎస్ సపోర్టు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా అనేక బిల్లుల్లో కేంద్రానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని అన్నారు.