Home > తెలంగాణ > Barrelakka : ప్రొ.కోదంరామ్ ను కలిసిన బర్రెలక్క.. ఎందుకో తెలుసా?

Barrelakka : ప్రొ.కోదంరామ్ ను కలిసిన బర్రెలక్క.. ఎందుకో తెలుసా?

Barrelakka : ప్రొ.కోదంరామ్ ను కలిసిన బర్రెలక్క.. ఎందుకో తెలుసా?
X

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదంరామ్తో బర్రెలక్క(శిరీష) సోమవారం సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ఆమె స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, తదితర అంశాలపై ఆమె కోదంరామ్తో చర్చించారు. స్థానిక పరిస్థితులను బట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించేలా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, అన్ని జిల్లాల్లో పోటీ పరీక్షల కోసం ఉచితంగా శిక్షణ కేంద్రాలు ప్రారంభించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆమె కోరారు. ఆమె విజ్ఞప్తిపై కోదండరాం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని బర్రెలక్క ఇప్పటికే ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు స్థానం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాక ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలిగే ధైర్యం వచ్చిందని ఆమె తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు తనను మరింత దృఢంగా మార్చాయని పేర్కొన్నారు. ఓటుకు నోటు అనే విధానాన్ని రూపు మాపడంపై కృషి చేస్తానని, ప్రజల్లో చైతన్యం తీసుకువస్తానని బర్రెలక్క చెప్పారు. నిరుద్యోగులు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.




Updated : 22 Jan 2024 2:49 PM GMT
Tags:    
Next Story
Share it
Top