Home > తెలంగాణ > తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియాను కోరాం.. భట్టి విక్రమార్క

తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియాను కోరాం.. భట్టి విక్రమార్క

తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియాను కోరాం.. భట్టి విక్రమార్క
X

రానున్న పార్లమెట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని కోరామని, అందుకు ఆమె సానుకూలంగా స్పందించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి ఎలా తీసుకురావాలన్న అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగిందని అన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం పన్నాల్సిన వ్యూహాలపై వార్ రూమ్ లో చర్చ జరిగిందని తెలిపారు. పోల్ మేనేజ్మెంట్ లో ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలనే విషయాన్ని వార్ రూమ్ లో బాగా వివరించారని తెలిపారు. న్యూట్రల్ ఓట్లపై ఫోకస్ చేయాలని అధిష్టానం సూచించినట్లు పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 14 సీట్లు గెలుచుకుంటుందని, ఇదే విషయాన్ని హైకమాండ్ కు చెప్పామని అన్నారు. పార్లమెట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కాగా నల్గొండ ఎంపీ సీటును 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుచుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


Updated : 11 Jan 2024 2:18 PM GMT
Tags:    
Next Story
Share it
Top