Home > తెలంగాణ > అందరి గురి మల్కాజ్‌గిరి పైనే.. ఒకే పార్టీ నుంచి 8 మంది ప్రయత్నం!

అందరి గురి మల్కాజ్‌గిరి పైనే.. ఒకే పార్టీ నుంచి 8 మంది ప్రయత్నం!

అందరి గురి మల్కాజ్‌గిరి పైనే.. ఒకే పార్టీ నుంచి 8 మంది ప్రయత్నం!
X

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానంపై చాలా మంది నేతలు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిలో పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఈ పోటీ బీజేపీలో ఎక్కువగా ఉంది. బీజేపీ నుంచి మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే టికెట్ తెచ్చుకోవడానికి లాబీయింగ్ మొదలుపెట్టారు. బీజేపీకి చెందిన ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, వీరేందర్ గౌడ్, చాడ సురేష్ రెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, కరుణ గోపాల్, మల్క కొమురయ్య మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే వారంతా ఎవరికి వారే టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టికెట్ ఎవరికి ఇవ్వాలో అర్థం గాక బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు టాక్. ఈ నేపథ్యంలోనే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని పార్టీ అధిష్టానం స్పష్టం చేసినట్లు ఆ పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. బీజేపీయేతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది నేతలు మల్కాజ్‌గిరిలో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొన్నటిదాక మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్నారు. ఇటీవలే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.


Updated : 2 Feb 2024 3:09 PM IST
Tags:    
Next Story
Share it
Top