Home > తెలంగాణ > రాముడి ఫోటోతో కరెన్సీ నోట్లు రావాలి.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

రాముడి ఫోటోతో కరెన్సీ నోట్లు రావాలి.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

రాముడి ఫోటోతో కరెన్సీ నోట్లు రావాలి.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
X

రాముడి ఫోటోతో రూ.500 నోట్లు రావాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి మోడీ చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఇది తనొక్కడి కోరిక కాదని దేశంలోని 100 కోట్ల హిందువుల ఆకాంక్ష అని ఆయన అన్నారు. అందరి తరఫున రూ.500 నోటుపై శ్రీ రామచంద్రుడి ఫోటో ఉండాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ నెల 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ఉండగా.. అదే రోజు శ్రీ రాముని చిత్రాలతో ఉన్న రూ.500 నోటును ఆర్బీఐ విడుదల చేయబోతుందంటూ వార్తలు వచ్చాయి. రాముడి చిత్రంతో పాటు అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం చిత్రంతో కూడిన నోటును కూడా ఆర్బీఐ రిలీజ్ చేయబోతుందంటూ ప్రచారం జరిగింది. అయితే అవన్నీ అసత్య ప్రచారాలు అంటూ ఆర్బీఐ కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలోనే కొందరూ హిందూ మద్దతుదారులు రూ.55 నోటుపై శ్రీరాముడి చిత్రం ముద్రిస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు.

దేశంలో 100 కోట్లకు పైగా జనం హిందువులుగా ఉన్నారని, మరి అలాంటప్పుడు హిందూ దేవుడి ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రిస్తే వచ్చే నష్టమేంటని అంటున్నారు. అయితే భారత్ లౌకిక దేశమని, కేవలం ఒక్క మతానికే చెందిన దేవుడి చిత్రాన్ని ముద్రిస్తే మిగతా మతాల దేవుళ్ల పరిస్థితి ఏంటి అనే డిమాండ్లు ఉత్పన్నం అవుతున్నాయి. ఇక ఎల్లుండి జరిగే శ్రీ రామచంద్రుడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులంతా కూడా రామ నామ స్మరణలో మునిగిపోయారు. దేశం మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇప్పటికే రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలని దేశంలోని చాలా మంది ప్రముఖలందరికీ ఆహ్వానాలు అందాయి.

Updated : 20 Jan 2024 5:59 PM IST
Tags:    
Next Story
Share it
Top