Home > తెలంగాణ > సీఎం రేవంత్ని కలిసిన బ్రిటిష్ హైకమిషనర్

సీఎం రేవంత్ని కలిసిన బ్రిటిష్ హైకమిషనర్

సీఎం రేవంత్ని కలిసిన బ్రిటిష్ హైకమిషనర్
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భారత్ లోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో బుధవారం సాయంత్రం అలెక్స్ ఎల్లిస్ సీఎంను కలిశారు. అలెక్స్ ఎల్లిస్ తో పాటు తెలంగాణ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఒవెన్, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురాం, ఎంఈఏ బ్రాంచ్ సెక్రటరియేట్ హెడ్ జె.స్నేహజ తదితరులు సీఎంను కలిశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. అదేవిధంగా పలువురు అర్జున అవార్డు గ్రహీతలు, 2023 ఏషియన్ గేమ్స్ పతక విజేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం క్రీడాకారులను సన్మానించారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు తీసుకొచ్చి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

Updated : 24 Jan 2024 8:03 PM IST
Tags:    
Next Story
Share it
Top