Balka Suman : సీఎం రేవంత్పైనా కేసు పెట్టాలి.. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఓ క్రిమినల్ అని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని అన్నారు. ఈ కేసులోనే తాజాగా సుప్రీంకోర్టు రేవంత్ కు నోటీసులు ఇచ్చిందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధం, నయవంచన అన్నట్టుగా తయారైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాలపై కక్షసాధింపుకు దిగుతోందని అన్నారు. ఈ క్రమంలోనే తనపై కేసులు పెట్టారని అన్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డిని పరుశ పదజాలంతో విమర్శించానని తనపై కేసు పెట్టారన్న సుమన్.. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్ ను అదే పరుష పదజాలంతో విమర్శించారని అన్నారు. తనపై కేసు పెట్టినట్లు సీఎం రేవంత్ పై కూడా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే తమ పార్టీ నేతలను ఇష్టమొచ్చినట్లుగా తిడుతున్న కాంగ్రెస్ నేతలపై కూడా కేసు పెట్టాలని అన్నారు.
కేసీఆర్ ను తిట్టిన రేవంత్, తనను తిట్టిన ఇతర కాంగ్రెస్ నేతలపై కేసులు పెడితే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని అన్నారు. తనపై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే తాము పెట్టిన కేసులను కూడా స్వీకరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కక్షసాధింపు చర్యలను ఆపాలని అన్నారు. ఇలాగే ప్రవర్తిస్తే సీఎం, ఆయన పార్టీ నేతలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.