Home > తెలంగాణ > సమ్మక్క-సారక్కల సాక్షిగా సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పారు..బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్

సమ్మక్క-సారక్కల సాక్షిగా సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పారు..బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్

సమ్మక్క-సారక్కల సాక్షిగా సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పారు..బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్
X

మేడారంలో సమ్మక్క-సారక్కల సాక్షిగా సీఎం రేవంత్ అబద్ధాల చెప్పారని బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ ఆరోపించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ పచ్చి అబద్దం చెప్పారుని అన్నారు. అయిపోయిన పెళ్ళికి బాజా కొట్టినట్టు ఉంది సీఎం రేవంత్ తీరు అని సెటైర్లు వేశారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లు రేవంత్ తనవిగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కలిపితే ఎలా అని అన్నారు. మేడారం అమ్మవార్ల సాక్షిగా అబద్దాలాడినందుకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కరెంటు కోతలకు కొందరు అధికారులే కుట్ర పన్నారని, కరెంటు కట్ చేస్తే కొలువులు తీసేస్తా అని రేవంత్ అంటున్నారని అన్నారు. రేవంత్ తన చేతకాని తనాన్ని అసమర్ధతను చిన్న ఉద్యోగులపై ఫత్వాలు జారీ చేసి చూపిస్తున్నారని అన్నారు.

భట్టి విక్రమార్క విద్యుత్ శాఖకు మంత్రిగా ఉన్నారని, కరెంటు పోయినందుకు ఆయన్ను కూడా రేవంత్ సస్పెండ్ చేస్తారా అని నిలదీశారు. కేసీఆర్ హయం లో కను రెప్ప కొట్టుకునే సమయం కూడా కరెంటు పోలేదని, కానీ రేవంత్ రాగానే కరెంటు ఇబ్బందులు ఎందుకు మొదలయ్యాయి అనేది ఆలోచించాలని, రేవంత్ కు పాలన చేతకావడం లేదని ప్రజలు గ్రహించాలని అన్నారు. 27వ తేదీ నాడు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధి రెండు గ్యారంటీలు ప్రారంభిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, కానీ కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీల్లో 13 హామీలున్నాయని అన్నారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అన్నారని తెలిపారు. రాష్ట్రం లో కోటి 24 లక్షల గ్యాస్ కనెక్షన్లు, 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని అన్నారు. కానీ 40 లక్షల మందికే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, అలా అయితే మిగతా 50 లక్షల మంది పరిస్థితి ఏంటని అన్నారు.

పైగా ఏడాదికి 3 నుంచి 5 సిలిండర్లు మాత్రమే ఇస్తామని అంటున్నారని.. ఇది దగా మోసం కాదా అని మండిపడ్డారు. ప్రజా పాలన కింద ఎంత మంది 500 కే సిలిండర్ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకున్నారో చెప్పడం లేదని, అలాగే తెల్ల రేషన్ కార్డుల కోసం కొత్తగా ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో చెప్పడం లేదని అన్నారు. ముందు డబ్బులు వినియోగదారుడు కట్టాలి.. తర్వాత సబ్సిడీ ఇస్తామనేది సరి కాదని అన్నారు. రాష్ట్రం లో కోటి 34 లక్షల 48 వేల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, వారందరికీ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.




Updated : 24 Feb 2024 12:10 PM GMT
Tags:    
Next Story
Share it
Top