Home > తెలంగాణ > మీరెట్లా ప్రభుత్వ సలహాదారులను నియమించారు?.. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి

మీరెట్లా ప్రభుత్వ సలహాదారులను నియమించారు?.. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి

మీరెట్లా ప్రభుత్వ సలహాదారులను నియమించారు?.. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి
X

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సలహాదారుల వ్యవస్థ రద్దు అన్న రేవంత్ రెడ్డి నేడు సలహాదారులను ఎలా నియమిస్తారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారులు ఎందుకు అని రేవంత్ రెడ్డి అన్నారని, కానీ ఇప్పుడు ఆయన సీఎం కాగానే నలుగురు సలహాదారులను నియమించుకున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పేదొకటి.. చేసేదొకటి అని విమర్శించారు. రాష్ట్ర అవసరాల కోసం, పాలనలో పని తీరు మెరుగుపర్చుకోవడం కోసం రిటైర్డ్ అధికారులను సలహాదారులుగా కేసీఆర్ నియమించుకున్నారని, కానీ నేడు రేవంత్ రెడ్డి ఫక్తు రాజకీయ నాయకులను సలహాదారులుగా నియమించుకున్నారని అన్నారు. ఓటుకు నోటు కేసులో సహకరించిన వ్యక్తులకు రేవంత్ రెడ్డి పదవులు కట్టబెట్టారని అన్నారు. వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు కాదన్న ఆయన.. నరేందర్ రెడ్డి సీఎం

రేవంత్ రెడ్డి స్వంత సలహాదారు అని ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల సలహాదారుగా షబ్బీర్ ఆలీని నియమించారని, మరి ఆ శాఖల మంత్రి ఏ బాధ్యతలు నిర్వహించాలని ప్రశ్నించారు. రాజకీయ పునరావాసం కోసమే సలహాదారులను నియమిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే నియామకాలన్నీ వృధా నియామకాలు అని అన్నారు. ఇక ప్రజా పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 రోజుల్లో ఢిల్లీ, విదేశీ పర్యటనలకే సమయం వెచ్చించారని ఎద్దేవా చేశారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు వెయ్యి మీటర్ల లోతులో బొంద పెడతారని అన్నారు.

Updated : 21 Jan 2024 10:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top