Home > తెలంగాణ > బీఆర్ఎస్ బలహీనపడితే రోజూ విమర్శలెందుకు?: బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి

బీఆర్ఎస్ బలహీనపడితే రోజూ విమర్శలెందుకు?: బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి

బీఆర్ఎస్ బలహీనపడితే రోజూ విమర్శలెందుకు?: బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి
X

బీఆర్ఎస్ బలహీనపడిందని బీజేపీ నాయకులు అంటున్నారని, మరి బీఆర్ఎస్ బలహీనపడితే రోజూ తమ పార్టీ నేతలపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్కసీటు కూడా గెలవదని బీజేపీ నాయకులు అంటున్నారని, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రిలవెన్స్ లేదని అంటున్నారని అన్నారు. అదే నిజమైదే తమ నేతలను పనిగట్టుకొని ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. తాను ఎంపీగా ఉన్న సెగ్మెంట్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలుచుకోలేదని, అలాంటి వ్యక్తి తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని సెటైర్లు వేశారు. హైదరాబాద్ నగరంలో రాజాసింగ్ సీటు తప్ప ఇంకో సీటును కూడా గెలవని బీజేపీ నేతలు తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ బలహీనపడిందని బండి సంజయ్ అంటున్నారని, మరి ఆయనెట్లా బీఆర్ఎస్ వ్యక్తి చేతిలో ఓడిపోయారని అన్నారు.

ఇక నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినా డాక్టర్ లక్ష్మణ్ మూడోస్థానంలో నిలిచారని, ఇదేనా బీజేపీ బలం అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు కేంద్రం సాయం చేసినట్లయితే ప్రత్యక్షంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగక.. ఈ విజయసంకల్ప యాత్రలు ఎందుకు అని ప్రశ్నించారు. ఖాళీగా ఉంటే రోజు తన్నుకు చస్తున్నారని బీజేపీ అధిష్టానం భావించి ఇలా వారితో యాత్రలు చేయిస్తోందని సెటైర్లు వేశారు.అసలు బీజేపీ యాత్రలో బీఆర్ఎస్ నేతలను తిట్టడం తప్ప రాష్ట్రానికి తాము ఏమేమీ పనులు తెచ్చారో ఒక్కరన్నా చెబుతున్నారా అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్.. నగరంలో సింగిల్ సీట్ సాధించిన బీజేపీ తమ పార్టీ సత్తా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్న ఆయన.. రాష్ట్రానికి న్యాయం జరగాలని పోరాడేది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమేనని అన్నారు.

రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఒక్క బీజేపీ ఎంపీ అయినా మోడీని ప్రశ్నించగలగుతారా అని నిలదీశారు. ఐటీఐఆర్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, నిమ్స్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, విభజన హామీలు.. ఇలా ఏవీ కూడా బీజేపీ ఎంపీలు సాధించలేకపోయారని, వాళ్ల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదని అన్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీ రిలవెన్స్ లేదనే వాళ్ళు ఎన్డీఏలో ప్రాంతీయ పార్టీలను ఎందుకు భాగస్వామ్యం చేశారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ అన్న శ్రీధర్ రెడ్డి.. ఈసారి రాష్ట్రంలో బీజేపీకి 4 సీట్లు వస్తే గొప్పవిషయమని అన్నారు.


Updated : 24 Feb 2024 3:07 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top