Home > తెలంగాణ > BRS Leaders : గవర్నర్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ నేతలు

BRS Leaders : గవర్నర్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ నేతలు

BRS Leaders : గవర్నర్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ నేతలు
X

నామినేటెడ్ ఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 5న హైకోర్టు విచారణ చేపట్టనుంది. దాసోజ్ శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జులైలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి మండలి తీర్మానం చేసింది. అనంతరం ఆ తీర్మానాన్ని ఆమోదం కోసం గవర్నర్ తమిళి సై వద్దకు పంపారు. అయితే గవర్నర్ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. అయితే గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారని, ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు మంత్రి మండలికి ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు.

Updated : 3 Jan 2024 9:08 PM IST
Tags:    
Next Story
Share it
Top