Home > తెలంగాణ > ఐదుగురు సభ్యులున్నా గంటల కొద్దీ టైం ఇచ్చినం: హరీశ్ రావు

ఐదుగురు సభ్యులున్నా గంటల కొద్దీ టైం ఇచ్చినం: హరీశ్ రావు

ఐదుగురు సభ్యులున్నా గంటల కొద్దీ టైం ఇచ్చినం: హరీశ్ రావు
X

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలే ఉన్నా అసెంబ్లీలో మాట్లాడటానికి గంటల కొద్దీ సమయమిచ్చామని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీలో తమ సభ్యులకు ఎక్కువ సమయం ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆనాడు ఐదుగురు సభ్యులున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు గంటన్నర సమయం ఇచ్చామని అన్నారు. ఇది మొదటి సభ అని, ఇందులోనే ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమపై అనేక స్లీపింగ్ రిమార్క్స్ చేశారని, తాము మాత్రం అలా మాట్లాడబోమని అన్నారు.

సీఎం ప్రసంగం తీరు చూస్తే ఇంకా ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగానే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సభా నాయకుడిగా అలా మాట్లాడటం కరెక్ట్ కాదని హితవు పలికారు. కుటుంబ పాలనపై రేవంత్ రెడ్డి మాట్లాడటం చూస్తే గొంగళిలో వెంట్రుకలు ఏరుకున్నట్లు ఉందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ప్రస్థానం చూస్తూ ఎవరిది కుటుంబ పాలననో అర్థమవుతుందని అన్నారు. విపక్ష నాయకులు మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారని అన్నారు. తనకు కనీసం 15 నిమిషాల సమయం ఇవ్వాలని స్పీకర్ ను కోరారు. మాట్లాడమంటే మాట్లాడుతానని, లేకుంటే వాకౌట్ చేస్తానిని హరీశ్ రావు అన్నారు.

Updated : 16 Dec 2023 12:36 PM GMT
Tags:    
Next Story
Share it
Top