6 గ్యారెంటీలను వెంటనే నెరవేర్చాలి.. సబితా ఇంద్రారెడ్డి
X
ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు దళిత బంధుతో పాటు అనేక పథకాలను ప్రవేశపెట్టి పేదలను ఆదుకున్నారని అన్నారు. కేసీఆర్ కందుకూరు వరకు మెట్రో తీసుకురావడానికి ప్రయత్నిస్తానని అన్నారని తెలిపారు. మెట్రో, ఫార్మాసిటీలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడం సరి కాదని అన్నారు. ఫార్మాసిటిని రద్దు చేస్తే ఆ భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని, ప్రజాపాలన లో ప్రజలు అప్లై చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ సభల్లో బ్యానర్లను కడితే ఊరుకోమని హెచ్చరించారు. రైతు బంధును అకౌంట్ లోకి వేయడంలో ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 9వ తేదీ నుంచి రూ.15వేల ఇస్తామన్న హామీని మరిచిపోయారని ఆరోపించారు.