Home > తెలంగాణ > అర్జున అవార్డు గ్రహీతలకు ఎమ్మెల్సీ కవిత విషెస్

అర్జున అవార్డు గ్రహీతలకు ఎమ్మెల్సీ కవిత విషెస్

అర్జున అవార్డు గ్రహీతలకు ఎమ్మెల్సీ కవిత విషెస్
X

వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం నుంచి అర్జున అవార్డు సాధించిన క్రీడాకారులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి ఈశా సింగ్ షూటింగ్ విభాగంలో అర్జున అవార్డు సాధించగా.. మహ్మద్ హుస్సాముద్దీన్ బాక్సింగ్ విభాగంలో అర్జున్ అవార్డుకు ఎంపికయ్యాడు. తమ ఆటతో రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారని రాష్ట్రానికి చెందిన క్రీడాకారులిద్దరినీ ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అలాగే దేశవ్యాప్తంగా క్రీడా అవార్డులకు ఎంపికైన వాళ్లకు కూడా ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 22 Dec 2023 11:56 AM IST
Tags:    
Next Story
Share it
Top