Home > తెలంగాణ > కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. ఎమ్మెల్సీ కవిత

కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. ఎమ్మెల్సీ కవిత

కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. ఎమ్మెల్సీ కవిత
X

భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్‌ను సస్పెండ్ చేస్తూ భారత క్రీడా శాఖ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తాజాగా ఈ విషయమై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో భారత రెజ్లర్లు చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ గర్వకారణమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశం తరఫున ఆడేందుకు ఎందరో మహిళలు పరితపిస్తుంటారని, అలాంటి వాళ్ల కోసం న్యాయమైన, పారదర్శకమైన వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం భారత రెజ్లింగ్‌కు బలమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ కు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ సింగ్ సన్నిహితుడు అని భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితరులు ఆరోపించారు. మహిళా క్రీడాకారులను వేధించన వ్యక్తి (బ్రిజ్ భూషణ్)కి సన్నిహితుడైన వ్యక్తిని గెలిపించడం తమను తీవ్రంగా బాధించిందంటూ రెజ్లింగ్ కు రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నట్లు సాక్షి మాలిక్ ప్రకటించగా.. తనకిచ్చిన పద్మశ్రీని వెనక్కి ఇస్తున్నట్లు బజరంగ్ పునియా తెలిపాడు. కాగా త్వరలో ఉత్తరప్రదేశ్ గోండాలో జరిగే కుస్తీ పోటీలకు తొందరపాటుగా అండర్-15, అండర్-20 జట్లను ఎంపిక చేసినందుకే తాము భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేసినట్లు క్రీడా శాఖ ప్రకటించింది.

Updated : 24 Dec 2023 10:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top