Home > తెలంగాణ > కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్
X

సర్జరీ జరిగిన చాలా రోజులకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ అయ్యారు. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ఆయన శుక్రవారం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌజ్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. రాజ్యసభ, లోక్ సభలో పార్టీ పార్లమెంటరీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిని కేసీఆర్ రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంతో రాజీ పడే ప్రసక్తిలేదని, సభలో కేంద్రాన్ని నిలదీయాలని కేసీఆర్ ఎంపీలకు చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశాల్లో తమ ప్రదర్శనను బట్టే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ కు ఓటేస్తారని, ఎట్టి పరిస్థితుల్లో కేంద్రాన్ని విమర్శించే అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పినట్లు తెలుస్తోంది.

త్వరలోనే తాను ప్రజా జీవితంలోకి వస్తానని, ఎట్టిపరిస్థితుల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు అధైర్యపడవద్దని చెప్పినట్లు సమాచారం. కాగా పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభమై ఫిబ్రవరి 9 వరకు కొనసాగుతాయి. వచ్చే లోక్‌సభల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నది. ఇక సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రప‌‌‌‌తి ద్రౌప‌‌‌‌ది ముర్ము ప్రసంగించనుండగా.. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌‌‌‌న్ మ‌‌‌‌ధ్యంత‌‌‌‌ర బ‌‌‌‌డ్జెట్‌‌‌‌ను ప్రవేశపెడుతారు.


Updated : 26 Jan 2024 11:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top