Home > తెలంగాణ > పారిశుధ్య కార్మికులతో కేటీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

పారిశుధ్య కార్మికులతో కేటీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

పారిశుధ్య కార్మికులతో కేటీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
X

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ న్యూ ఇయర్ వేడులను పారిశుధ్య కార్మికులతో జరుపుకున్నారు. సోమవారం న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు జీహెచ్ఎంసీ కార్మికులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయానికి వచ్చిన జీహెచ్ఎంసీ కార్మికులను ఒక్కొరిని పలకరిస్తూ కేటీఆర్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారందికీ భోజనాలు పెట్టించారు. కేటీఆర్ వారి మధ్య కూర్చొని భోజనం చేశారు. భోజనం ఎలా ఉందని వారిని ప్రశ్నించారు. తర్వాత కార్మికులతో సెల్పీలు దిగారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. కాగా గత ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే.

Updated : 1 Jan 2024 3:37 PM IST
Tags:    
Next Story
Share it
Top