మాకు కొట్లాట కొత్తేమీ కాదు.. కేటీఆర్
X
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు కొట్లాట కొత్తేమీ కాదని అన్నారు. బుధవారం ప్రాజెక్టుల విషయంలో అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసన చేపట్టారు. ఈ రోజు ఆ ఫోటోలను కేటీర్ తన ట్విట్టర్ లో షేర్ చేసి కామెంట్ చేశారు. తమకు కొట్లాట కొత్తేమీ కాదని అన్నారు. గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేశామని అన్నారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని అన్నారు. నిన్న (బుధవారం) అసెంబ్లీలో బీఆర్ఎస్ పోరాట పటిమను చూశాక తెలంగాణ ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని అన్నారు. కాగా గత కొన్ని రోజులుగా కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పగించే విషయమై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ సందర్శనకు పోగా.. బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో కేసీఆర్ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక కేసీఆర్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కౌంటర్ ఇచ్చారు.