Home > తెలంగాణ > నిరుపేదల ఇండ్లను కూల్చడం దారుణం.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నిరుపేదల ఇండ్లను కూల్చడం దారుణం.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నిరుపేదల ఇండ్లను కూల్చడం దారుణం.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తానన్న ప్రభుత్వం ఆ నిరుపేదల ఇండ్లనే కూల్చడం దారుణమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం పెసర్ కుంటలో గతేడాది పెద్దవాగు ఉప్పొంగడంతో నిర్వాసితులైన 14 ఎస్సీ కుటుంబాలకు గత ప్రభుత్వం సర్వే నెం.450లో ఎకరం భూమిని కేటాయించిందని అన్నారు. ఈ క్రమంలోనే వారు ఇండ్లు నిర్మించుకుంటుంటే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేశారని అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించి నిర్వాసితులకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వాలని కోరారు. అదేవిధంగా పేదలు అని కూడా చూడకుండా దుర్మార్గంగా వ్యవహరించిన రెవిన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శిలపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే నిర్వాసితుల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Updated : 16 Dec 2023 8:46 PM IST
Tags:    
Next Story
Share it
Top