కాకా సేవలు మరువలేనివి.. సీఎం రేవంత్ రెడ్డి
X
కాకా (వెంకట్స్వామి) సేవలు మరువలేనివని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో నిర్వహించిన 'గ్రాడ్యుయేషన్ డే'కు సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇవాళ గడ్డం వెంకట్ స్వామి (కాకా) వర్థంతి నేపథ్యంలో కాలేజీలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం కాకా జీవితాంతం పోరాటం చేశారని అన్నారు. పేదలకు నాణ్యమైన విద్య అందాలనే సంకల్పంతో ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు మీద కళాశాలలు ఏర్పాటు చేశారని అన్నారు. ఆయన కుమారులు గడ్డం వినోద్, వివేక్ లు తమ తండ్రి బాటలో నడుస్తూ 50 ఏళ్లుగా ఎంతో మంది పేద విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని సీఎం అన్నారు. దేశంలో గాందీ కుటుంబం కాంగ్రెస్ కు అండగా ఉంటే.. రాష్ట్రంలో కాకా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా నిలబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ కరస్పాండెంట్ సరోజా వివేక్, వంశీకృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.