Home > తెలంగాణ > రాజకీయాల్లో ఈశ్వరీబాయి తనదైన ముద్ర వేశారు.. సీఎం రేవంత్ రెడ్డి

రాజకీయాల్లో ఈశ్వరీబాయి తనదైన ముద్ర వేశారు.. సీఎం రేవంత్ రెడ్డి

రాజకీయాల్లో ఈశ్వరీబాయి తనదైన ముద్ర వేశారు.. సీఎం రేవంత్ రెడ్డి
X

ఈశ్వరీబాయి రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని అన్నారు. తాను రాజకీయాల్లో ఉంటూనే తన కూతురు గీతారెడ్డిని వైద్యురాలిగా చేశారని అన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ఈశ్వరీబాయి వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రావడం తనకు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఆ రోజుల్లోనే అంబేద్కర్ స్పూర్తిగా రాజకీయాల్లో ఈశ్వరీబాయి క్రియాశీలంగా పని చేశారని అన్నారు. రాజకీయాల్లో రాణిస్తూనే తన కూతురు గీతారెడ్డి గారిని డాక్టర్ చదివించారని అన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక మహిళ ఉన్నట్లు.. గీతారెడ్డి ప్రతి విజయంలో ఆమె భర్త సహకారం ఉందని అన్నారు.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గీతారెడ్డి క్రియాశీలకంగా పనిచేశారని అన్నారు.

ఆరోగ్య సమస్యలను పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పనిచేశారని, అందుకే గీతారెడ్డి ఇంచార్జిగా ఉన్న నల్లగొండ జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచామని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గీతారెడ్డి అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించారని అన్నారు. గీతారెడ్డి లాంటి వారు మంత్రివర్గంలో లేకపోవడం ఒక లోటు అని, మంచికి, చెడుకు ఎప్పటికీ తమకు అండగా ఉండే వ్యక్తి గీతారెడ్డి అని అన్నారు. ఏ అవకాశం ఉన్నా గీతారెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు.




Updated : 24 Feb 2024 7:59 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top