Home > తెలంగాణ > గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోండి.. CM Revanth Reddy

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోండి.. CM Revanth Reddy

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోండి.. CM Revanth Reddy
X

వచ్చే వేసవిలో రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాలపై సీఎం రేవంత్ మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. తాగునీరు అందని గ్రామాలను గుర్తించేందుకు సర్వే చేయాలని అన్నారు. తాగునీటికి నియోజకవర్గానికో రూ.కోటి ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కేవలం గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికీ నీళ్లు ఇవ్వటం కాకుండా, కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. అందుకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేయటం సులభమవుతుందని, తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుందని అన్నారు.

మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక్ సాగర్ లాంటి కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లన్నింటినీ తాగునీటికి వాడుకోవాలని అన్నారు. రోడ్లు లేని 422 గ్రామాలు, 3,177 ఆవాసాలకు తారు రోడ్లు వేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలకు చేయూతగా కొత్త కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి సీతక్క, ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Updated : 30 Jan 2024 8:00 PM IST
Tags:    
Next Story
Share it
Top