Home > తెలంగాణ > కరాచీ బేకరీ పేలుడుపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

కరాచీ బేకరీ పేలుడుపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

కరాచీ బేకరీ పేలుడుపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
X

శంషాబాద్ RGIA పోలీస్ స్టేషన్ పరిధి గగన్ పహాడ్ లోని కరాచీ బేకరీలో గురువారం గ్యాస్ సిలిండర్ పేలి 15 మంది తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక కరాచీ బేకరీ గోడౌన్ పేలుడు ఘటనలో గాయపడ్డవారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారిలో 8 మందిని కంచన్ బాగ్ డీఆర్డీవో ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిని వేరే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కాగా అగ్రిప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మండలను ఆర్పివేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రజలను ప్రమాదస్థలానికి రాకుండా చర్యలు తీసుకున్నారు.


Updated : 14 Dec 2023 5:40 PM IST
Tags:    
Next Story
Share it
Top