‘బంజారా చరిత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
X
బంజారాల చరిత్ర గొప్పదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ సూర్యాధనుంజయ్, మాజీ సీటీవో డాక్టర్ ధనుంజయ్‌నాయక్ సంయుక్తంగా రచించిన ‘బంజారా చరిత్ర’ పుస్తకాన్ని బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం రచయితలు మొదటి ప్రతిని రేవంత్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..
లిఖిత చరిత్ర లేని బంజారా గిరిజన తెగ ఘనమైన చరిత్రను పుస్తకరూపంలో సమాజానికి అందించడం అభినందనీయమని అన్నారు. బంజారాల చరిత్రను గ్రంథస్తం చేసేందుకు విశేష కృషి చేసిన రచయితలను అభినందించారు. అనంతరం రచయితలు ప్రొఫెసర్ సూర్యాధనుంజయ్, సీటీవో డాక్టర్ ధనుంజయ్ నాయక్ మాట్లాడుతూ.. సీఎం చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసి, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.