Home > తెలంగాణ > కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సీఎం రేవంత్

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సీఎం రేవంత్

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సీఎం రేవంత్
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు సమస్యలను వారు కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణం, ప్రాంతీయ రింగ్ రోడ్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధి, సిర్పూర్-కాగజ్ నగర్ నేషనల్ హైవే, భువనగిరి రహదారి, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ఆయనకు వివరించారు. రాష్ట్రానికి చెందిన 15 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారుల స్థాయికి అప్ గ్రేడ్ చేయాలని వారు ఆయనను కోరారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్రం మంజూరు చేసిన కేబుల్ బ్రిడ్జిని మరో ప్రాంతానికి మార్చాలని కోరారు.

సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు నిధుల కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇక నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్ మంజూరు చేయాలని, నల్గొండలో రవాణా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోమటిరెడ్డి కేంద్రమంత్రి గడ్కరీని కోరినట్టు తెలిసింది. కాగా గతంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు ప్రాజెక్టులు, పనులకు అనుమతులు, నిధులు ఇవ్వాలంటే వారు ప్రధానిని కోరారు.


Updated : 20 Feb 2024 6:34 PM IST
Tags:    
Next Story
Share it
Top