అధికారిక కార్యక్రమాల్లో నా సోదరుల జోక్యం ఉండదు.. సీఎం రేవంత్
X
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో తన సోదరుల జోక్యం ఏమాత్రం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సీఎంగా తాను పగ్గాలు చేపట్టి 30 రోజులు అవుతున్న నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన షర్మిల ఉదంతంపై రేవంత్ మాట్లాడారు. తనకు రాజకీయంగా, వ్యాపారపరంగా తన సోదరులు పూర్తి స్థాయిలో మద్దతుగా ఉన్నారని, అయితే తమ మధ్య బంధం ఫ్యామిలీ వరకే ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో తన సోదరులు ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోరని అన్నారు. తన సోదరులే కాదు.. తన సతీమణి, కూతురు కూడా తన సీఎం పదవిని వాడుకోరని క్లారిటీ ఇచ్చారు. తాను సీఎం అయిన వెంటనే వాళ్లందరినీ కూర్చోబెట్టి అధికారిక దుర్వినియోగానికి గానీ.. ప్రభుత్వంలో అనవసర జోక్యం గానీ చేసుకోవద్దని చెప్పానని అన్నారు. అందుకు వాళ్లు చాలా సంతోషంగా అంగీకరించారని అన్నారు. కొంతమంది అధికారులే తన సోదరుల వద్దకు వస్తున్నారన్న రేవంత్ .. తన సోదరులు ఏ అధికారులకు ఫోన్ చేయలేదని అన్నారు.