నేడు ఎన్టీఆర్ వర్థంతి.. సీఎం రేవంత్ ఏమన్నారంటే?
X
ఈరోజు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వర్థంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పై ఉన్న తన గౌరవాన్ని, అభిమానాన్ని రేవంత్ రెడ్డి చిన్న కవిత రూపంలో పంచుకున్నారు. తెలుగు జాతి అస్థిత్వ పతాక ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు నేలకు జవసత్వ ప్రతీక ఎన్టీఆర్ అని కొనియాడారు. కాగా ఇవాళ ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఆ మహానాయకుడిని స్మరించుకుంటున్నారు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్‌కి వళ్లి నివాళులు అర్పిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఉదయాన్నే ఘాట్‌కి వెళ్లి నివాళులు అర్పించగా.. ఆయన కూతురు నారా భువనేశ్వరి కూడా నివాళలు అర్పించారు. అలాగే ఎన్టీఆర్ మనవళ్లు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
ఇక ఆయన కుమారుడు రామకృష్ణతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ సమాధి వద్ద పూల మాలలు ఉంచి నివాళులు అర్పించారు. వారితో పాటు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయాణాన్ని టీడీపీతోనే ఆరంభించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సమయంలోనే ఆయన చంద్రబాబు నాయుడికి అత్యంత ఆప్తుడిగా మారారు. అయితే తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి అనతి కాలంలోనే టీపీసీసీ ప్రెసిడెంట్ కూడా అయ్యారు. ఇక ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు రావడంతో రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
congress,cm revanth reddy,fomrer cm ,actor,ntr,death anniversary,tributes,chandrababu naidu,balakrishana