Home > తెలంగాణ > ఢిల్లీకి మరోసారి సీఎం రేవంత్.. ఆ విషయాలపై చర్చ

ఢిల్లీకి మరోసారి సీఎం రేవంత్.. ఆ విషయాలపై చర్చ

ఢిల్లీకి మరోసారి సీఎం రేవంత్.. ఆ విషయాలపై చర్చ
X

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో ఆయన భేటీ కానున్నట్లు టీపీసీసీ వర్గాలు తెలిపాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై సీఎం వారితో చర్చించనున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ తరఫున ఎవరిని అభ్యర్థులుగా బరిలోకి దించాలనే అంశంపై కూడా ఆయన పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. అదేవిధంగా నామినేటెడ్ పదవుల కేటాయింపుపై కూడా అధిష్ఠానంతో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇదే ఆరోసారి కానుంది. కాగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలను ఏఐసీసీ కార్యాలయానికి పిలిపించుకుంది. వారితో ఎంపీ ఎన్నికల గురించి, అలాగే ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించనున్నారు. అయితే ఈ సమావేశానికి కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం రేవంత్ రెడ్డి హాజరుకాలేదు. దీంతో ఆయన ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. అవే అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాలను తీసుకొని తుది నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.




Updated : 12 Jan 2024 9:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top