Home > తెలంగాణ > రాహుల్ గాంధీపై సీఎం రేవంత్ మరో కవిత

రాహుల్ గాంధీపై సీఎం రేవంత్ మరో కవిత

రాహుల్ గాంధీపై సీఎం రేవంత్ మరో కవిత
X

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కవిత్వం ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీని పొగడుతూ ఎక్స్ వేదికగా పలు కవితలు పెట్టిన రేవంత్ రెడ్డి తాజాగా మరో కవితను పోస్టు చేశారు. రాహుల్ వ్యక్తిత్వాన్ని పొగడుతూ ఆయన కవిత్వం రాశారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉండగా.. రాహుల్ గాంధీ తన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్నారు.

రాహుల్ పై రేవంత్ చెప్పిన కవిత్వం ఇదే

గర్వంలో గరీబు…

ప్రేమకు నవాబు

నాయకుల్లో సామాన్యుడు…

నాయకత్వంలో అసమాన్యుడు

జనంలో ఒక్కడు…

ప్రభంజనంలో ఒకేఒక్కడు

భారత్ న్యాయ్ యాత్రికుడు

భరతమాత ముద్దుబిడ్డ మన రాహుల్ గాంధీ


Updated : 18 Jan 2024 7:39 PM IST
Tags:    
Next Story
Share it
Top