కలెక్టర్లు, ఎస్పీలతో ముగిసిన సీఎం సమావేశం
X
రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. 6 గ్యారెంటీలు విజయవంతంగా అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పని చేయాలని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం లేకుంటే టార్గెట్ రీచ్ కాలేమని అన్నారు. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్ర సాయిలో అమలు చేసేది మాత్రం ప్రజా ప్రతినిధులు, అధికారులు మాత్రమేనని సీఎం అన్నారు. ప్రజా పాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కబ్జాదారులు, అక్రమార్కులను ఉపేక్షించవద్దని, ఈ విషయంలో పోలీసులకు ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లు తెలిపారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, అయితే అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురానంత వరకే అని అన్నారు. తమ ప్రభుత్వానికి ఎవరు చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రయత్నించినా ఊరుకునే ప్రసక్తిలేదని సీఎం అన్నారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తాతో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.