Home > తెలంగాణ > సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన రద్దు.. కారణం ఇదే?

సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన రద్దు.. కారణం ఇదే?

సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన రద్దు.. కారణం ఇదే?
X

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించేందుకు పార్టీ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు సమన్వయకర్తలను సమీక్షల కోసం ఢిల్లీకి ఆహ్వానించింది. అయితే పలు కారణాల దృష్ట్యా సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లలేదని తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తన అభిప్రాయాలను అధిష్టానానికి తెలిపారని, అందువల్లే ఆయన ఈరోజు ఢిల్లీకి వెళ్లలేదని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలు సోనియా, ఖర్గే, రాహుల్ లతో చర్చించి అనుమతి తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం షెడ్యూల్ లో సైతం ఢిల్లీ టూర్ లేదని సీఎంవో వర్గాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడ్డట్లు సమాచారం. ఇక రాష్ట్రం నుంచి పార్లమెంట్ ఎన్నికల గురించి చర్చించడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.


Updated : 11 Jan 2024 12:17 PM GMT
Tags:    
Next Story
Share it
Top